Friday, November 22, 2024

16 మందికి ఎల్లో ఫీవర్‌ వ్యాక్సినేషన్‌

అమరావతి, ఆంధ్రప్రభ: అంతర్జాతీయ వ్యాక్సినేషన్‌ సెంటర్లో ఇప్పటి వరకు 16 మంది ప్రయాణీయకులు ఎల్లోఫీవర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారని ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ జె.నివాస్‌ తెలిపారు. 27వ తేదీన ఎనిమిది మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారన్నారు. ఇందులో ఆరుగురు యూఎస్‌ఏకి ఇద్దరు నైజీరియాకు వెళుతున్నట్లు తెలిపారు. 28,29 తేదీల్లో ఎనిమిది మంది వ్యాక్సిన్లు వేయించుకున్నట్లు చెప్పారు. వీరిలో ఏడుగురు యూఎస్‌ఏకు ఒకరు నైజీరియాకు వెళుతున్నారన్నారు. ఎల్లో ఫీవర్‌ టీకా తీసుకోవాలనుకొనేవారు ముందస్తు అపాయింట్‌మెంట్‌ తీసుకోవాల్సిందిగా సూచించారు. వివిధ దేశాలకు వెళ్లే పర్యాటకులు ఎక్కువగా ఎల్లో ఫీవర్‌ వ్యాక్సిన్‌ను డిమాండ్‌ చేస్తున్నారని ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్‌ అన్ని పనిదినాలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ కొనసాగుతుందన్నారు.

పర్యాటకులందరూ స్కాన్‌ చేసిన తమ పాస్పోర్టు కాపీని yfvcsmcggh @ gmail.comకు మెయిల్‌ చేయటం ద్వారా వ్యాక్సినేషన్‌ కోసం అపాయింట్మెంట్‌ పొందవచ్చన్నారు. తరువాత వారు తమ సందేహాలకువాట్సప్‌ చాట్‌ (8978633599) ద్వారా సమాధానాలు పొందవచ్చని సూచించారు.. ఈ సేవల కోసం సుశిక్షితులైన డాక్టర్లు, సిబ్బందిని అందుబాటులో వుంచామని చెప్పారు. ఒక వ్యక్తికి వ్యాక్సినేషన్‌ కోసం రు.500 నామమాత్రపు రుసుము వసూలు చేస్తామని, ఈ మొత్తాన్ని ఇంటర్నేషనల్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్‌ పేరిట హెచిఎఫ్సీ బ్యాంక్‌ ఖాతా నెం. 9991234566999కు చెల్లించవచ్చన్నారు. ఒక రోజులో కనీసం ఇద్దరు వ్యక్తులు వ్యాక్సినేషన్‌ కోసం అపాయింట్‌ మెంట్‌ పొందవచ్చని, వ్యాక్సినేషన్‌ కోసం ఇద్దరు కన్నా ఎక్కువ మందిని అనుమతిస్తారని నివాస్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement