హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ కర్నాటక వరకూ ఉపరిత ద్రోణి గాలులతో పాటు కర్నాటకపై 3.1 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడే అకాశం ఉన్నట్లు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని ప్రకటించింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలలో సాధారణ స్థాయి కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..