Friday, November 22, 2024

తెలంగాణకు ఎల్లొ అలర్ట్​.. మూడు రోజులపాటు భారీ వర్షాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజులపాటు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, రంగారెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌ , జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలతోపాటు హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ , కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 18న ఉత్తర అండమాన్‌, దాని పరిసరాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది.

ఉత్తర , ఈశాన్య దిశ నుంచి గాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. వారం రోజుల్లో తెలంగాణ నుంచి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమిస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాలు ని ష్క్రమణ ప్రారంభం కావడంతో వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. రెండు మూడు రోజుల తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టినట్లు అనిపించినప్పటికీ ఉదయం లేదా సాయంత్రం చిరుజల్లులు కురిసే అవకాశం ఉండొచ్చని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement