Saturday, November 9, 2024

రాజ్యసభ నుంచి వైసీపీ ఎంపీల వాకౌట్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. రాజ్యసభలో గనులు, ఖనిజాల సవరణ బిల్లుపై చర్చ జరుగుతున్న క్రమంలో వైసీపీ ఎంపీలు వాకౌట్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకోమని, స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. కాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతోంది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు దీనిపై పోరాటం చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement