టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిఐడి నోటీసు ఇవ్వడంతో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక దీంతో అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపైఒకరు మీడియా ముందుకు వచ్చి విమర్శలు, ప్రతి చేసుకుంటున్నారు. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. నీ మ్యానిపులేషన్, మీడియా రాజకీయాలు నడవవు చంద్రబాబు… వైసీపీ పాలన లో అక్రమాలు అరాచకాలను అంటూ రోజు ప్రెస్ మీట్ లు, పచ్చ మీడియా లో డిబేట్ లు పెట్టించావు. రెండేళ్లలో టిడిపి ఓటింగ్ 10 శాతం తగ్గింది. 39 నుంచి 29 ఓట్ల శాతం పడింది. మీ పార్టనర్ జనసేనకు ఆరు నుంచి నాలుగు కు పడింది. అవినీతికి పాల్పడి నానఅడ్డదారులు తొక్కే బదులు ఒక్క కేసు నైనా ఎదుర్కొని నిర్దోషిగా బయటపడగలవా చంద్రం.
చట్టం ముందు నిలబడే దమ్ము ఉందా అసలు ? సిగ్గులేకుండా వందోసారి స్టే కోసం ప్రయత్నం చేస్తున్నావు. ప్రజాకోర్టులో ఇంకా ఘోరమైన శిక్షలు తప్పవు. ఎమ్మెల్యే గా కూడా నీకు ఓటమి తప్పదు. నీకు ఇల్లు జై అయిపోతుంది.. అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు. మరి దీనిపై టిడిపి నేతలు ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి.