Friday, November 22, 2024

జగన్ బెయిల్ రద్దు -నేనే పిటిషన్ వేశా :RRR

రఘురామకృష్ణంరాజు… గెలిచింది వైసీపీ పార్టీ తరఫున అయినా వైసిపి నాయకులకు దడ పుట్టిస్తున్నాడు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన రఘురామకృష్ణంరాజు కొన్ని ఆసక్తికర అంశాలను తెరమీదకు తీసుకువచ్చారు. 11 సిబిఐ ఛార్జిషీట్ లతో ఏ1 ముద్దాయిగా ఉన్న సీఎం జగన్ అభివృద్ధి పనులు అంటూ కోర్టుకి హాజరు కాకపోవడం ఎంత వరకూ కరెక్ట్ అని ప్రశ్నించారు. అందుకే జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సిబిఐ కోర్టులో నేనే పిటిషన్ వేశానని తెలిపారు రఘురామకృష్ణంరాజు.

న్యాయ వ్యవస్థ నుంచి ఈ విషయంపై ఎలాంటి తీర్పు వస్తుందోనని వేచి చూడాలన్నారు. జగన్ తో సహా నిందితులుగా ఉన్న మరికొంత మంది ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు, రాజకీయ నాయకులకు కీలక పదవులు ఇచ్చారని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఇవన్నీ తోటి నిందితులను ప్రభావితం చేయడం కాదా అని ప్రశ్నించారు. అయితే ఇదంతా జరుగుతుంటే సీబీఐ ఏం చేస్తుందని నిలదీశారు.

ఆరోపణలు వచ్చినందుకే మహారాష్ట్ర హోమ్ మంత్రి రాజీనామా చేస్తే ఇన్ని చార్జిషీట్లలో పేరున్న జగన్ ఆయనను ఎందుకు ఆదర్శంగా తీసుకోలేదన్నారు. జైలుకు వెళ్లిన తర్వాత సీఎం పదవిని భార్య భారతికో, విజయమ్మకో ఎవరికి ఇస్తారో మీ ఇష్టం అంటూ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement