Saturday, November 23, 2024

తిరుపతి ఉపఎన్నిక ప్రత్యేకహోదాకు రెఫరెండం: వైసీపీ ఎంపీ

ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని వైసీపీ మరోసారి తెరపైకి తెచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 23 మంది ఎంపీలు ఉన్నా దాదాపు ప్రత్యేక హోదా అంశం మరుగున పడిపోయిందని రాజకీయ పండితులు భావిస్తున్న తరుణంలో మరోసారి ప్రత్యేకహోదా అంశాన్ని అధికార పార్టీ లెవనెత్తింది. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న రాజమండ్రి ఎంపీ మర్గాని భరత్ తిరుపతి ఉపఎన్నిక అంశంపై మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఉప ఎన్నికను ప్రజలు ప్రత్యేక హోదాకు రెఫరెండంగా భావించాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సెగ ప్రధాని మోదీని తాకాలంటే… ఉప ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

అటు టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌పై మంత్రి భరత్ విమర్శలు చేశారు. సీఎం జగన్‌ను ఉద్దేశించి నారా లోకేష్ మాట్లాడుతున్న పదజాలం పద్దతిగా లేదని.. నారా లోకేష్ తాతా, తండ్రి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారన్న విషయం మర్చిపోకూడదని హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement