Tuesday, November 26, 2024

ఎన్టీఆర్ ఇన్… బాబు అవుట్ – అంబటి

టీడీపీ అధినేత చంద్రబాబు పై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ఠీఆర్ వారసులకు పౌరుషం ఉంటే టీడీపీ పార్టీకి ఈ గతి పట్టేదికాదన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంలోకి వస్తున్నాడంటే.. చంద్రబాబుకు చేతకాదనేగా అర్ధం అని ఎద్దేవచేశారు. టీడీపీ పార్టీని అంతరించిపోతున్న రాజకీయ పార్టీ అనాలో..ప్రధాన ప్రతిపక్షం అనాలో సందేహంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత గౌరవం పొందిన నటుడు రామారావు 1982లో పార్టీ స్థాపించారు. ఆయన ప్రారంభిస్తే చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్లు చంద్రబాబు చేరాడని విమర్శించారు అంబటి. కనుచూపు మేరలో టీడీపీ పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితి కనిపించటం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు దొరకరని విమర్శించారు.

మళ్లీ తిరిగి టీడీపీ అధికారంలోకి రావడం ఒక కల అని చంద్రబాబు, లోకేష్ గుర్తుంచుకోవాలన్నారు. మీ పార్టీ కార్యాలయాల్లో ఇక హెరిటేజ్ మాల్స్ పెట్టుకోవాల్సిదేనని అన్నారు. అమరావతి, పొలవరాన్ని ఆదాయమార్గంగా మార్చుకున్నది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక అబద్దాన్ని పదే పదే చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తాడు. బీజేపీకి ఎన్ని సీట్లు ఉన్నాయి..పవన్ కళ్యాణ్ ఎక్కడ గెలిచాడు… అయన సీఎం ఎలా అవుతాడు అంటూ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement