ఏపీలో రాజకీయం వేడెక్కింది. తిరుపతి ఉప ఎన్నిక టార్గెట్ గా అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచారాలు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అధికార పార్టీకి సంబంధించిన వైసీపీ మంత్రులు తిరుపతిలో మకాం వేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పుదుచ్ఛేరికి హోదా ఇస్తామని బిజెపి మేనిఫెస్టోలో ప్రకటించింది. ఏపీకి మాత్రం ముగిసిన అధ్యాయం అంటూ కబుర్లు చెబుతోందని విమర్శించారు పేర్ని నాని.
బీజేపీ ఒక పచ్చి మోసకారి అని అన్నారు. పుదుచ్ఛేరి హోదా ఇస్తామని నిర్మలాసీతారామన్ ప్రకటించింది. ఏపీకి ఇవ్వలేని హోదా అక్కడ ఎలా ఇస్తారో బిజెపి చెప్పాలన్నారు. బెంగాల్ లో బిజెపి రౌడీయిజం ఎలా చేస్తుందో… మమతా చెబుతున్నారన్నారు. ఇక పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించడంలో ఎలాంటి విశేషం లేదన్నారు. ప్రజాశాంతి పార్టీ పెట్టి కేఏపాల్ కూడా సీఎం అభ్యర్థి గా ప్రకటించుకున్నాడని పవన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. తిరుపతి ఉప ఎన్నికల్లో జగన్ ఎలాంటి టార్గెట్ ఇవ్వలేదన్నారు.