ఏపీని దుష్ట చతుష్టయం పట్టి పీడీస్తోందని, రాష్ట్ర ప్రజలను వైసీపీ నేతలు సమస్యల్లో నెట్టేస్తున్నారని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ…. సీఎం జగన్ పాలనలో ఏపీ రూ.7.76 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందని ఆయన చెప్పారు. జగన్ మరోసారి బహిరంగ మార్కెట్, కార్పొరేషన్ల రుణాలను తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయాలని ఆయన కోరారు. ప్రశ్నిస్తోన్న ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. ఏపీలో మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జగన్‌కు అర్థమైందని ఆయన అన్నారు. అందుకే ఆయన ఏపీని మరింత అప్పుల ఊబిలోకి నెట్టాలని చూస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం గురించి ఆలోచించకుండా తన పార్టీ గురించే జగన్ ఆలోచిస్తున్నారని యనమల చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement