Friday, November 22, 2024

ఏలూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. పోస్టల్ బ్యాలెట్లలో వైసీపీ ఆధిక్యం

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించగా అధికార పార్టీ వైసీపీకి ఆధిక్యం వచ్చింది. వైసీపీ-11, టీడీపీ- 1, నోటా- 1, చెల్లనివి 2 ఓట్లు వచ్చాయి. అనంతరం డివిజన్ల వారీగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 50 డివిజన్లలో ఇప్పటికే 3 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. 47 డివిజన్లకు కౌంటింగ్ కొనసాగుతోంది.

కాగా కౌంటింగ్ ప్రాంగణంలో నాలుగు హాళ్లలో 47 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. ఒకొక్క టేబుల్‌లో ఒక్కొ డివిజన్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. లెక్కింపు కోసం 64 మంది సూపర్‌ వైజర్లను, కౌంటింగ్‌ అసిస్టెంట్లను 250 మందిని ఏర్పాటు చేశారు. వీరు కాకుండా 500 మంది మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియలో కొవిడ్ నిబంధనలను పాటిస్తున్నామని అధికారులు చెప్పారు.

ఈ వార్త కూడా చదవండి: ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తే.. కోటీశ్వరులు కావొచ్చు

Advertisement

తాజా వార్తలు

Advertisement