దళితులపై వైసీపీ కపట ప్రేమ చూపిస్తోందని, మాజీ డ్రైవర్ ను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని సస్పెండ్ చేసినట్టు డ్రామా ఆడిందని టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనందబాబు విమర్శించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య నేపథ్యంలో వచ్చిన ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకే కోనసీమ, అమలాపురం అల్లర్లను సృష్టించారని అన్నారు. అంబేద్కర్ ను అల్లర్లలోకి లాగడం సిగ్గు చేటని అన్నారు. దళిత ఓటు బ్యాంకు దూరమవుతున్నందుకే వైసీపీ నేతలు కొత్త కుట్రలకు తెరలేపుతున్నారని చెప్పారు. అసలు పచ్చని కోనసీమ తగలబడటానికి జగనే కారణమని ఆరోపించారు. ఇది సీఎం కార్యాలయం ఒక పథకం ప్రకారం ఆడిన కుట్ర అని చెప్పారు. కోనసీమ అల్లర్లలో వైసీపీ నేతలను పోలీసులు నిందితులుగా ప్రకటిస్తే… జగన్ మాత్రం అల్లర్లకు ప్రతిపక్షం కారణమని అంటున్నారని ఎద్దేవా చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement