రాష్ట్రపతి ఎన్నికల కోసం పోటీ రసవత్తరంగా సాగుతోంది. ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారో అనే విషయమై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఎన్డీయే తరపున ద్రౌపది ముర్ము, విపక్షాల తరపున యశ్వంత్ సిన్హా ఎన్నికల బరిలో నిలిచారు. వీరిద్దరూ ఇప్పటికే వివిధ పార్టీల అధినేతలతో మాట్లాడుతూ మద్దతివ్వాలని కోరుతున్నారు. తాజాగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తనకు మద్దతివ్వాలని కోరుతూ ప్రధాని మోదీకి విపక్షాల అభ్యర్థి సిన్హా ఫోన్ చేశారు. మోదీతో పాటు బీజేపీ కురువృద్ధుడు అద్వానీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ లకు కూడా ఆయన ఫోన్ చేశారు. ఎన్డీయే అభ్యర్థి ముర్ముకు మద్దతు భారీగానే లభిస్తుందని చెప్పవచ్చు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా మద్దతు కోరుతూ వివిధ పార్టీల అగ్రనేతలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈసారి రాష్ట్రపతి ఎన్నిక రసవత్తరంగా సాగుతుందని పలువురు రాజకీయ నిపుణులు అంటున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement