Tuesday, November 19, 2024

Spl Story: బెంగళూరులో యముడి మకాం.. రోడ్లపై జర్నీతో ప్రాణాలు పోవుడు ఖాయమేనట!

బెంగళూరులో యమధర్మరాజు మకాం వేశాడు. ప్రాణాలను తీసుకెళ్లేందుకు ఏకంగా రోడ్లమీదికి వచ్చాడు. చేతిలో యమపాశం, ఆ పక్కన దున్నపోతు కూడా ఉంది. అయితే.. కర్నాటక రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిని తెలియజేసేందుకు చేంజ్​ మేకర్స్​ అనే సంస్థ ఇట్లాంటి వినూత్న నిరసన చేపట్టింది. అంతేకాకుండా డబులింజన్​ సర్కారు ఉన్న కర్నాటకలో ఇంత ఘోరంగా రోడ్లుంటయా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. అంతేకాకుండా 13 కిలోమీటర్ల రోడ్డుకు 25కోట్ల ఫండ్స్​ రిలీజ్​ అయితే.. 2కిలోమీటర్లు మాత్రమే వేసి మిగతా డబ్బంతా మింగేశారని మండిపడుతున్నారు.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

బెంగళూరులోని రోడ్ల పరిస్థితిని ఎత్తిచూపేందుకు ‘చేంజ్‌మేకర్స్ ఆఫ్ కనకపుర రోడ్’ అనే సంస్థ ఒక దున్నపోతు, యమరాజు వేషధారణలో ఉన్న వ్యక్తితో నిరసన ప్రదర్శన నిర్వహించింది. సోషల్ మీడియాలో వైరల్​ అవుతున్న ఈ పొటో వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయంటున్నారు స్థానికులు.  

స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చేంజ్​ మేకర్స్​ ఆఫ్​ కనకపుర రోడ్​ అనే సంస్థ చాలా రోజులుగా నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ మధ్య ఒక వ్యక్తికి హెల్త్​ బాగాలేదు. అతని కండిషన్​ సీరియస్​ కావడంతో అంబులెన్స్​కి కాల్​చేశారు. అయితే.. అక్కడ రోడ్డు బాగా లేకపోవడంతో అంబులెన్స్​ చేరుకోలేదు. అప్రమత్తమైన స్థానికులు కారులో తీసుకెళ్లారు.. అయినా ఆలస్యం కావడంతో ఆసుపత్రిలో చనిపోయాడని తెలిపాడు అలీమ్​ అనే నిరసనకారుడు.

దీంతో స్థానికులతో పాటు ఈ సంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయినా.. బెంగళూరు డెవలప్​మెంట్​ అథారిటీ (బీడీఏ) అధికారులు కొంచెం కూడా పట్టించుకోవడం లేదు. గత ఏడాది కూడా ఇట్లాంటి పరిస్థితి ఉండగా.. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో కాస్త స్పిందించారు. అయితే. ఇక్కడ 10 ఏళ్లుగా రోడ్డు చాలా దారుణంగా ఉందని, ఇది మాత్రమే కాదు.. అంజనాపురా రోడ్లు అన్నీ దారుణంగా ఉన్నాయని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

అయితే.. 13 కిలోమీటర్ల రహదారి కోసం 25కోట్ల రూపాయలు విడుదల కాగా, కేవలం 2 కిలీమీటర్లు మాత్రమే రోడ్డు వేసి వదిలేశారని.. మిగతా డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు యువకులు. బీజేపీ ప్రభుత్వం, డబులింజన్​ సర్కారు అంటే ఇంత ఘోరంగా రోడ్లు ఉంటాయా?, ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందా అని ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తున్నారు. బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (బిడిఎ), స్థానిక ఎమ్మెల్యే స్పందించకుంటే రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement