ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం యాహు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను మనదేశంలో మూసివేస్తు నిర్ణయం తీసుకుంది. హు కంపెనీ యాహు న్యూస్, యాహు బిజినెస్, యాహు క్రికెట్ తదితర వెబ్ సర్వీసులకు ఇండియాలో నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, యాహులోని మెయిల్ ఖాతాదారులపై ఎలాంటి ప్రభావం ఉండదని యాహు వెబ్ సర్వీస్‌ను నిర్వహిస్తున్న వేరిజాన్ మీడియా తెలియజేసింది. భారత ప్రభుత్వం ఇటీవల చట్టాల్లో మార్పులు చేయడం వలన తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాహూ తెలిపింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో విదేశీ పెట్టుబడులు 26శాతానికి పరిమితం చేయడంతో దానికి తగ్గట్టుగా తమ సర్వీసులకు నడపలేమని చెప్పింది యాహూ. ఈ మేరకు తమ సర్వీసులను ఇండియాలో నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి: వ్యాక్సిన్ తీసుకోనివారికి షాకింగ్ న్యూస్..