తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి బయల్దేరారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ దృష్ట్యా జరుగుతున్న పనులను కేసీఆర్ పరిశీలించనున్నారు. ఆ తర్వాత సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి.
సుదర్శన యాగంలో 1108 యజ్ఞ గుండాలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో గుండానికి ఆరుగురు చొప్పున మొత్తం 6వేలకు పైగా రుత్విక్కులు ఈ యాగంలో పాలుపంచుకుంటారు. ఆలయ పునఃప్రారంభం సందర్భంగా వేడుకలకు వచ్చే ప్రముఖులు, అతిథులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, పెద్ద ఎత్తున తరలివచ్చే లక్షలాది భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపైనా సీఎం కేసీఆర్ సమీక్షిస్తారు. అలాగే, యాగశాల నిర్మాణ పనులు కూడా కేసీఆర్ పరిశీలిస్తారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..