Friday, November 22, 2024

కాశ్మీర్‌ ఫైల్స్‌ డైరెక్టర్‌ వివేక్‌కు వై కేటగిరి భద్రత.. సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల పహారా

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సినిమా కాశ్మీర్‌ ఫైల్స్‌ ఎన్నో వివాదాల నడుమ విడుదలై.. థియేటర్స్‌లో ప్రదర్శితమవుతున్నది. ఈ సినిమా రికార్డుల చుట్టూ వివాదాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రికి కేంద్రం భద్రత పెంచింది. ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో.. సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందితో కూడిన వై కేటగిరీ భద్రతను కల్పించాలని నిర్ణయించింది. చిన్న సినిమా అయినప్పటికీ.. ఇప్పుడు రికార్డు వసూళ్లు నమోదు చేస్తూ దూసుకెళ్తున్నది. స్వయంగా ప్రధాని మోడీ, అమిత్‌షా సహా నేతలు కూడా సినిమాను పొగడేస్తున్నారు. కాశ్మీర్‌ లోయలో హిందూ పండిట్‌లపై జరిగిన ఆకృత్యాలను కళ్లకు కట్టినట్టు చూపించారంటూ పలువురు చెబుతున్నారు. అయితే కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్నది. ఇక నుంచి అగ్నిహోత్రి ఎక్కడికెళ్లినా సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో భద్రత కల్పిస్తారు. సినిమాకు పలు రాష్ట్రాల్లో వినోద పన్ను మినహాయించిన విషయం కూడా తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement