భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. కొత్త ఏడాది తొలి రోజున ఎక్స్‌పోశాట్ శాటిలైట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. PSLV-C58 రాకెట్ ద్వారా ఎక్సోపోశాట్ శాటిలైట్‌ను విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. కాగా, రాకెట్ నుంచి విడిపోయిన శాటిలైట్‌ను నిర్ణీత భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగానికి సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్‌ను ఇస్రో విడుదల చేసింది.
పోలారిమెట్రీ మిషన్ విశ్వంలోని బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్, యాక్టివ్ గెలాక్సీ న్యూక్లియైలు, పల్సర్ విండ్ నెబ్యులే వంటి ఖగోళ మూలాల వివరాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. అంతరిక్షంలోని రహస్యాలను అణ్వేషించే పోలారిమెట్రీ మిషన్ ద్వారా ఖగోళ పరిశోధనల పరంగా అమెరికా తర్వాత రెండవ దేశంగా భారత్ నిలిచింది.