Friday, November 22, 2024

చిక్కుల్లో షావోమి విద్యుత్‌ కార్ల ప్రాజెక్ట్‌..

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీ షావోమికి సొంత దేశంలోనే చిక్కులు ఏర్పడ్డాయి. 2024 కల్లా తొలి విద్యుత్‌ కారు(ఈవీ)ని తీసుకు రావాలని ప్రయత్నిస్తున్న ఈ కంపెనీకి ఆదిలోనే కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. కార్ల తయారీకి ప్రభుత్వం అనుమతి కోసం చేసుకున్న దరఖాస్తు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. కార్ల తయారీ కోసం షావోమి 2021లో ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది.

వచ్చే 10 సంవత్సరాల్లో 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తగా ఈవీ కార్ల తయారీ రంగంలోకి వచ్చే కంపెనీలు, ఆర్థిక, సాంకేతిక సామర్ధ్యానికి సంబంధించిన పత్రాలు సమర్పించాలని చైనా ప్రభుత్వం నిబంధన పెట్టింది. చైనాలో ప్రస్తుతం టెస్లా, నియో, వారెన్‌ బఫెట్‌ పెట్టుబడులు ఉన్న బైడ్‌ వంటి కంపెనీలు పెద్ద కంపెనీలుగా ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement