Tuesday, November 26, 2024

WTC Points Table | మళ్లీ రెండో స్థానానికి భార‌త్..

రాజ్‌కోట్ వేదికాగా జరిగిన టెస్టులో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించిన భారత్ జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో తిరిగి రెండో స్థానానికి చేరుకుంది. గత వారం న్యూజిలాండ్‌.. స్వదేశంలో దక్షిణాఫ్రికాపై వరుసగా రెండు టెస్టులు గెలిచి అగ్రస్థానం దక్కించుకుంది. దీంతో రెండో స్థానంలో ఉన్న టీమిండియా మూడో స్థానానికి పడిపోయింది. అయితే, తాజాగా ఇంగ్లండ్‌ను 434 పరుగుల భారీ తేడాతో ఓడించిన రోహిత్‌ సేన.. ప్రస్తుతం రెండవ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాను వెనక్కినెట్టి తిరిగి రెండో స్థానానికి చేరుకుంది.

ఇక, ఇంగ్లాండ్‌పై విజయంతో భారత్‌.. ఐసీసీ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 59.52 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్‌.. 75 శాతంతో ఉండగా ఆస్ట్రేలియా.. 55 శాతంతో మూడో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, వెస్టిండీస్‌, సౌతాఫ్రికాలు తదుపరి స్థానాల్లో ఉన్నాయి. 21.88 శాతంతో ఇంగ్లండ్‌ 8వ స్థానంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement