సౌతాఫ్రికా చరిత్ర సృష్టించింది. ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ 2025కి చేరుకున్న మొదటి జట్టుగా అవతరించింది. దక్షినాఫ్రికా జట్టు WTC ఫైనల్స్‌కు చేరుకోవడం కూడా ఇదే మొదటిసారి. ప్రస్తుతం రెండో స్థానం కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్ జట్లకు ఆ అవకాశం ఉంది.
సెంచూరియన్ పార్క్ స్టేడియంలో పాకస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఘన విజయాన్ని సాధించింది దక్షిణాఫ్రికా. రెండు వికెట్ల తేడాతో పాక్‌ను మట్టికరిపించింది. గెలవడానికి అవసరమైన 147 పరుగులను అతి కష్టం మీద ఛేదించింది. ఎనిమిది వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.
సెంచూరియన్ పార్క్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. పాకిస్థాన్‌ను రెండు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో బెర్త్ ఖాయం చేసుకుంది. కాగా, లండన్ లార్డ్స్ స్టేడియం వేదికగి 2025 జూన్ 11 ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాతో ఏ జట్టు తలపడుతుందో చూడాలి. రేసులో ఆస్ట్రేలియా ముందంజలో ఉంది.