Friday, November 22, 2024

ఎస్ఐ పోస్టుల రాత పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు.. నిమిషం ఆలస్యం ఐనా నో ఎంట్రీ : రామగుండం సీపీ

ఆగస్టు 7న నిర్వహించబోయే ఎస్సై పోస్టుల నియామక ప్రిలిమినరీ పరీక్షను పకడ్బంధిగా నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శఎస్. చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.ఏన్టీపీసీ లోని మిలీనియం హల్ లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నియమావళి మేరకు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరిండెంట్ లకు, అబ్జర్వర్లకు, రీజినల్ కోఆర్డినేటర్స్ , పోలీస్ సిబ్బందికి అవగాహన కార్యక్రమంబీనిర్వహించి పరీక్ష సమయంలో సిబ్బంది మరియు అభ్యర్థులు పాటించవలసిన జాగ్రత్తల గురించి తెలియజేశారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 24 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందనీ, ఇందులో పెద్దపల్లి జోన్ పరిధిలో 07 పరీక్ష కేంద్రాలు, మంచిర్యాల జోన్ పరిధిలో లో 17 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. ఈ పరీక్ష ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారని, అన్ని పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా పరీక్షలకు పగడ్బందీగా నిర్వహించాలని సీపీ ఆదేశించారు.

రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల గుర్తింపు కొరకు బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకోవడం జరుగుతుందని, ఇందుకు వీలుగా అభ్యర్థులు పరీక్ష సమయానికి ఒక గంట ముందుగానే ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఉదయం 9 గంటల నుండి అభ్యర్థులను పరీక్ష కేంద్రం లోనికి అనుమతించడం జరుగుతుందని సూచించారు. ఉదయం 10 గంటల తర్వాత అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రం లోనికి అనుమతించ మన్నారు. అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రములను, ఒక్కరోజు ముందుగానే వచ్చి చూసుకోవాలని మరుసటి రోజు పరీక్ష కేంద్రానికి రావడానికి సులువుగా ఉంటుందన్నారు. పరీక్షకు సంబంధించిన నిబంధనలు పూర్తిగా హాల్ టికెట్లో పొందపరచి ఉంటాయని, అభ్యర్థులు ఒకటికి రెండుసార్లు హాల్ టికెట్ లోని నిబంధనలు చదువుకోవడం మర్చిపోవద్దని, పరీక్ష హాలు లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులకు అనుమతి ఉండదని, చేతులకు గోరింటాకు , మేహంది వంటివి పెట్టుకోవడం వలన బయోమెట్రిక్ లో వేలిముద్రలు సరిగ్గా వచ్చే అవకాశం ఉండదని, తద్వారా అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంటుందని, ఈ విషయాన్ని గ్రహించి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గోరింటాకు, మెహంది, వంటివి పెట్టుకో రాదని సూచించారు.

అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రం లోనికి అనుమతించరనీ, సెల్ ఫోన్లు, చేతి గడియారాలు మొదలగునవి ఎవరు తీసుకురాకూడదన్నారు. పరీక్షకు సంబంధించిన నిబంధనలు కచ్చితంగా అమలు చేయబడతాయని తెలిపారు. ఎంపిక విధానం పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని అభ్యర్థులు గుర్తించాలని ,ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించే మోసగాళ్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని, అటువంటి మోసగాళ్ల సమాచారం పోలీసులకు తెలపాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో అదనపు డీ.సీ.పీ అఖిల్ మహాజన్ , పెద్దపల్లి జోన్ రీజినల్ కో -ఆర్డినేటర్స్ జైరోద్దీన్, మంచిర్యాల జోన్ రీజినల్ కోఆర్డినేటర్ చక్రపాణి, ఏ ఆర్ ఏసీపీ లు సుందర్ రావు, మల్లికార్జున్, మంచిర్యాల సీఐ నారాయణ, గోదావరిఖని 1టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, మంథని సీఐ సతీష్, పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్స్ సత్యనారాయణ, ఆర్ఐ లు మధుకర్, అంజన్న, శ్రీధర్, అనిల్, ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, అశోక్, సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement