మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి మ్యాచ్‌లోనే భారీ స్కోర్ నమోదైంది. ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు సాధించింది టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ బేత్ మూనీ ఫీల్డింగ్ తీసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై తొలి బంతి నుంచే విరుచుకు పడింది. ముంబై కెప్టెన్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ (65)తో చెలరేగింది. .. చివర్లో అమేలియా కేర్ (45), పూజా వస్త్రాకర్ ధాటిగా ఆడారు. ఇసీ వాంగ్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టడంతో ముంబై ఇండియన్స్ 207 రన్స్ చేసింది. అమేలియాతో కలిసి హర్మన్‌ప్రీత్ నాలుగో వికెట్‌కు 89 పరుగులు జోడించింది. ఓపెనర్ హేలీ మ్యాథ్యూస్ (47) ధాటిగా ఆడింది. 69 పరుగుల వద్ద నాట్ సీవర్ బ్రంట్ (23) రెండో వికెట్‌గా వెనుదిరిగింది. గుజరాత్ గెలవాలంటే 208 పరుగులు చేయాల్సి ఉంది.. అయితే తొలి ఓవర్ లోనే వికెట్ కోల్పోయిన గుజరాత్ ఆ తర్వాత ఓవర్ లో మరో రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం గుజరాత్ నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 9 పరుగులు చేసింది.
డబ్ల్యూపీఎల్ టీ 20 – ముంబై అదుర్స్…. ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు… గుజరాత్ 8/3
Advertisement
తాజా వార్తలు
Advertisement