Friday, November 22, 2024

ఇది అట్లాంటి ఇట్లాంటి ఫోన్ కాదు.. 18జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్..

ప్ర‌భ‌న్యూస్: ప్రపంచం లోనే 18జీబీ ర్యామ్‌ 1టెరాబైట్‌ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో తొలి స్మార్ట్‌ ఫోన్‌ విడుదల కానుంది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ సంస్థ జెడ్‌టీ ఈ ఆక్సాన్‌ 30 సిరీస్ ఫోన్‌లను ఈ నెలలో విడుదల చేయనుంది. ఈ ఫోన్ హై అండ్‌ ఫీచర్లతో విడుదల కానుండటంతో వినియోగదారులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చైనా సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ వైబో కథనం ప్రకారం ప్రపంచంలోనే 18జీబీ ర్యామ్‌, 1టెరాబైట్‌ స్టోరేజ్‌ కలిగిఉన్న స్మార్ట్‌ ఫోన్‌ ఇదే మొదటిది. ఈ ఫోన్‌ను 2జీబీ నుంచి 18జీబీ వరకు ఎక్స్‌టెండ్‌ చేసుకునే అవకాశం ఉంటుందని కథనంలో పేర్కొన్నారు.

ఆక్సాన్‌ 30 ఫోన్‌ ధరను లాంచ్‌ చేసే సమయంలో ప్రకటించనున్నారు. 6.67 అంగుళాల డిస్‌ప్లే, 1080 ఇంటూ 2400 హెచ్‌డీ పిక్సెల్స్‌, 144 హెచ్‌జడ్‌ రిఫ్రెష్‌రేట్‌, 20:9 యాస్పెక్ట్‌ రేషియో, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ కలిగి ఉంటుంది. ఫోన్‌ ముందుభాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్‌కోసం 10మెగాపిక్సెల్‌ స్నాపర్‌ ప్యాక్‌, 66డబ్ల్యూ ఛార్జింగ్‌ సపోర్టుతో ఉంటుంది. అదేవిధంగా ఫోన్‌ వెనుకబాగంలో 64 మెగా పిక్సెల్‌ మెయిన్‌ కెమెరా, 64 మెగాపిక్సెల్‌ వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 120 డిగ్రీల శ్రీప్‌ఓవేతో 64మెగాపిక్సెల్‌ అల్ట్రావైడ్‌ షూటర్‌ క్వాడ్‌ కెమెరా సెటప్‌తో ఉండనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement