Saturday, November 23, 2024

ISRO | చంద్రయాన్ 3 కి వరల్డ్ స్పేస్ అవార్డు..

చంద్రుడి దక్షిణ ధ్రువంపై మొట్టమొదట కాలు మోపిన సాధించిన చంద్రయాన్ 3 ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్ ఘన కీర్తిని సాధించింది. ఈ ప్రయోగానికి ఇప్పటికే ప్రపంచ దేశాలు.. ఇస్రో సాధించిన ఘనతను పొగడ్తలతో ముంచెత్తాయి. కాగా, తాజాగా ఇస్రోకు మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కావడంతో వరల్డ్ స్పేస్ అవార్డు దక్కింది.

అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్.. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డును చంద్రయాన్ 3 కి ప్రకటించింది. ఇక‌ ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీన ఇటలీలోని మిలాన్‌లో జరగనున్న 75వ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాన్ఫరెన్స్ సందర్భంగా అవార్డును అందజేయనున్నారు.

చంద్రయాన్‌-3 సక్సెస్ కావడంతో తర్వాతి ప్రయోగంగా చంద్రయాన్‌-4 ను ఇస్రో చేపట్టనుంది. ఈ మిషన్‌లో చంద్రుడిపై నమూనాలను సేకరించి.. మళ్లీ తిరిగి భూమిపైకి తీసుకురానుంది. ఈ చంద్రయాన్ 4 ప్రయోగాన్ని 2026 నాటికి నిర్వహించాలని ఇస్రో సన్నాహాలు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement