వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు అలెగ్జాండర్ సోరోకిన్. ఇటలీలోని వెరోనాలో జరుగుతున్న యురోపియన్ ఛాంపియన్‌షిప్‌లో 41 ఏళ్ల లిథువేనియన్ రన్నర్ అలెగ్జాండర్ సోరోకిన్ . 24 గంటల్లో అతను 319.614 కిలోమీటర్ల దూరం పరిగెత్తాడు. ఆ రన్నర్ సగటున ఒక కిలోమీటర్ దూరాన్ని 4.30 నిమిషాల్లో దాటేశాడు. గతంలో అతని పేరిట ఉన్న రికార్డునే సోరోకిన్ బ్రేక్ చేశాడు. గత ఏడాది ఆగస్టులో 24 గంటల్లో అతను 303.506 కిలోమీటర్ల దూరాన్ని పరుగెత్తాడు. ఈ రికార్డుపై తన ఇన్‌స్టాగ్రామ్‌లో అతను స్పందించాడు. అలసిపోయానని, కానీ రికార్డు పట్ల రెండింతలు ఆనందంతో ఉన్నట్లు చెప్పాడు. సపోర్ట్ ఇచ్చిన వాళ్లకు అతను ధన్యవాదాలు తెలిపాడు. పోలాండ్ రన్నర్ పియోట్రోస్కీ 24 గంటల్లో 301.858 కిలోమీటర్ల దూరం పరుగు తీసి రెండో స్థానంలో నిలిచాడు. ఇటలీకి చెందిన మార్కో విసినిటీ 288 కిలోమీటర్ల దూరం పరుగు తీసి మూడవ స్థానంలో నిలిచాడు.
వరల్డ్ రికార్డ్ – 24గంటల్లో 319.614కిలోమీటర్లు పరిగెత్తిన అలెగ్జాండర్ సోరోకిన్
Advertisement
తాజా వార్తలు
Advertisement