దీపావళికి దీపాలు ఎన్ని వెలిగిస్తాం మహా అయితే 20యో, 30యో లేదంటే ఎవరి సత్తాకి తగ్గట్టుగా వారు ఈ దీపాలను వెలిగిస్తుంటారు. ఈ దీపాలను వెలిగించడంలో రికార్డ్ సృష్టించనుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఏకంగా 12లక్షల దీపాలను ఒకేసారి వెలిగించనున్నారట. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య దీపావళి వేడుకలకు ముస్తాబైంది. దీపావళి సందర్భంగా అత్యధిక దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు నమోదు చేసేందుకు అయోధ్య నగరం సిద్ధమైంది. ప్రభుత్వం రికార్డు స్థాయిలో 12 లక్షల దీపాలను వెలిగించడానికి ఏర్పాట్లు చేసింది. సరయు నదీ తీరంలోని రామ్ కి పైడీ ఘాట్‌లో 9 లక్షల దీపాలు వెలిగించనుండగా.. మిగిలిన దీపాలు వివిధ పట్టణాలలో వెలగనున్నాయి.నేడు 12 లక్షల మట్టి దీపాలతో దేదీప్యమానంగా అయోధ్య నగరం, సరయూ నదీ తీరం…శోభిల్లనుంది. ఒకేసారి 12లక్షల దీపాలు ..ఆ వెలుగులు చూడటానికి రెండు కళ్ళు చాలవేమో.
Advertisement
తాజా వార్తలు
Advertisement