Saturday, January 4, 2025

Population | కొత్త సంవత్సరంలో ప్రపంచ జనాభా 809 కోట్లు!

ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచ జనాభాతో పాటు భారత్ తో భారతదేశ జనాభా గురించి తాజాగా కీలక విషయం బయట పడింది. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా ఉండగా.. కొద్ది రోజుల క్రితమే భారత్ చైనాను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి ఎగబాకింది.

తాజాగా అమెరికాకు చెందిన ఓ జనాభా బ్యూరో ఒక ఆసక్తిక నివేదికను వెలువరించింది. 2025 జనవరి 1 నాటికి 1.396 బిలియన్ల జనాభాతో భారతదేశం అగ్రస్థానంలో ఉంటుందని… ప్రపంచ జనాభా 809 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. వచ్చే 2025 ఏడాది జనవరిలో ప్రపంచ జనాభా మరో 7.5 కోట్లు పెరుగుతుందని అమెరికా జనాభా బ్యూరో అంచనా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement