Thursday, November 21, 2024

ఉస్మానియాలో జూలై 15న ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవం-అంద‌రూ ఆహ్వానితులే

ప్లాస్టిక్ సర్జరీ విభాగం, హైద‌రాబాద్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ & సూపరింటెండెంట్, OGH ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవాన్ని 15 జూలై 2022న సూపరింటెండెంట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు జర‌గ‌నున్నాయి.ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.కాగా ఇండియాలో తొలి ప్లాస్టిక్ స‌ర్జ‌న్ ప్రొఫెస‌ర్ సి.బాల‌కృష్ణ‌గారు అనే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఉస్మానియా డాక్ట‌ర్ బి.ఎన్ ప్ర‌సాద్ గారి ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. కాగా ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చాలా మంది అనుకుంటున్న‌ట్లు అంద‌వికారుల‌ను అంద‌మైన వారుగా తీర్చిదిద్ద‌ట‌మే కాదు..ఈ కేట‌గిరిలో ప‌లు శ‌స్త్ర చికిత్స‌లు చేస్తారు..

పుట్టుక‌తో వ‌చ్చిన చిట్లిన పెద‌వులు..గ్ర‌హ‌ణం మొర్రి..పెద్ద పెద్ద పుట్టుమ‌చ్చ‌లు..ప‌చ్చ‌బొట్లు..తెల్ల‌మ‌చ్చ‌లని తొల‌గిస్తారు. కాలిని గాయ‌ములు కాలిన త‌రువాత ఏర్పడిన వంక‌ర చేతులు..మెడ..క‌నురెప్ప‌ల‌ను స‌రిచేస్తారు.అంతేకాదు ముఖంపై గాయాలు..ముఖంపై ఎముక‌లు విరుగుట‌..ముఖంపై మ‌చ్చ‌లు..ముఖం..నోటి లోప‌ల ఏర్ప‌డిన క‌ణితుల‌ను తొల‌గిస్తారు. వంక‌ర చెవులు..ముక్కులు స‌రిచేయుట‌..చెవి క‌మ్మ‌ల రంధ్ర‌ముల స‌ర్జ‌రి కూడా చేస్తారు..ఇంకా చేతికి అయిన గాయాలు..మిష‌న్ లో ప‌డి న‌లిగిపోయిన చేతివేళ్లు..చేతుల‌ను స‌రిచేయ‌డం..కుష్టువ్యాధి వ‌ల్ల వంక‌రైన చేతులు..కాళ్లు..ముఖం మొద‌లైన‌వాటికి ప్లాస్టిక్ స‌ర్జ‌న్ లో చికిత్స చేస్తారు. ఇంకా వీటితో పాటు బిగుసుకుపోయిన నోటి ఎముక‌ల జాయింట్స్..చాలాకాలం నుండి న‌యంకాని గాయాలు..లైపోస‌క్ష‌న్ ద్వారా లావుకాళ్లు..స్థూల‌కాయం త‌గ్గింపు..బ్రెస్ట్ స‌ర్జ‌రీ..రీకెన‌లైజేష‌న్ అంటే కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్ త‌ర్వాత సంతానం కోరుకునేవారికి ..మైక్రో స‌ర్జ‌రీ..తెగిన చేతులు..వేళ్లు అతికించ‌డం..బోధ‌కాల‌కి చికిత్స‌..డ‌యాబెటిస్ పుండ్ల‌కి చికిత్స‌..బ‌ట్ట‌త‌ల‌కు చికిత్స చేస్తారు. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో ఏర్పాటైన తెలంగాణలోని తొలి స్కిన్‌ బ్యాంకు కూడా ఉంది.ఈ చికిత్స‌ల‌న్నీ ఉచితంగా ఉస్మానియాలో అందుబాటులో ఉండ‌టం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement