వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ , జైషే మహ్మద్ చీఫ్, పుల్వామా దాడి మాస్టర్ మైండ్ మసూద్ అజహర్ దారుణ హత్యకు గురయ్యారు. మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. తెల్లవారుజామున 5 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన బాంబు పేలుడులో చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పాకిస్థాన్ ఇంకా ధృవీకరించలేదు. సోమవారం ఉదయం భవల్‌పూర్ మసీదు నుంచి తిరిగి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై బాంబు విసిరినట్లు కథనాలు వెలువడుతున్నాయి.
దాడికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో మార్కెట్‌లో పేలుడు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. పేలుడు అనంతరం తొక్కిసలాట జరిగింది. ప్రాణాలు కాపాడుకునేందుకు జనం పరుగులు తీస్తున్నారు. పేలుడు జరిగినప్పుడు మసూద్ అజార్ అక్కడే ఉన్నాడని ప్రచారం జరుగుతోంది.
పాక్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్ర ముఠా అధినేత అయిన మసూద్.. భారత్‌లో పలు భీకర దాడులకు సూత్రధారి. 1995లో భారత్ అతడిని అరెస్టు చేసింది. అయితే, 1999లో విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు అతడిని విడిపించుకున్నారు. ఆ తర్వాత అతడు జైషేను స్థాపించాడు. 2001లో పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడి, 2008లో ముంబయిలో జరిగిన బాంబు పేలుళ్లలోనూ ఇతడి ప్రమేయం ఉంది.
2019లో జమ్మూకశ్మీర్‌లో పుల్వామాలో సైనికుల కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడికి వెనుక మసూద్ మాస్టర్‌మైండ్ ఉంది. ఈ ఘటన తర్వాతే ఐక్యరాజ్యసమితి.. అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.