Friday, November 22, 2024

ఏపీకి 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించిన WHO

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏపీ రాష్ట్రానికి 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా అందించింది. WHO అందించిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఏపీలోని కోవిడ్ కేర్ సెంటర్లలో అత్యవసర చికిత్సలో భాగంగా ఉపయోగించనున్నారు.

గురువారం జరిగిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ సీఎం జగన్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల అంశాన్ని ప్రస్తావించారు. 18,500 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇవే కాకుండా జిల్లా స్థాయిలో 53 ఆక్సిజన్ ప్లాంట్లు, 50 క్రయోజెనిక్ ట్యాంకులు, 10 వేల డీ టైప్ సిలిండర్ల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అందుకోసం రూ.309 కోట్ల మేర వెచ్చిస్తున్నామని సీఎం జగన్ సభలో వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement