Monday, November 25, 2024

రోడ్డుమీద, పట్టాలపైనా.. వరల్డ్ ఫస్ట్ డ్యుయల్ రోల్ వెహికల్..

ఇప్పటి దాకా రోడ్డు.. నీటిలో ప్రయాణించే డ్యుయల్ రోల్ వెహికిల్స్ గురించే విన్నాం. ఇప్పుడు కొత్తగా రోడ్డుమీదా, పట్టాలపైనా పరుగులు తీసే సరికొత్త డీఎంవీని జపాన్‌కు చెందిన ఆసా కోస్ట్‌ రైల్వే కంపెనీ ఆవిష్కరించింది. దీన్నీ జపాన్‌లోని తోకుషిమా ప్రిఫెక్చర్‌లోని కైయో పట్టణంలో ప్రారంభించారు. ఇది రోడ్డుపై బస్సుగానూ, పట్టాలపై రైలు మాదిరిగా పరుగులు తీస్తుంది.

ప్రపంచంలోని తొలి డ్యూయల్‌ మోడ్‌ వాహనంగా ఈ వెహికిల్ గుర్తింపు పొందింది. రోడ్డుపై టైర్లతోనూ, పట్టాలపైన ఉక్కు చక్రాలతో ప‌రుగులు తీస్తుంది. ఇందుకోసం అండర్‌ బెల్లి ఆటోమేటిక్‌ అడ్జెస్ట్‌మెంట్‌ టెక్నాలజీతో ఇంటర్‌ చేంజ్‌ అయ్యే చక్రాలు ఈ వెహికిల్ కు అమర్చారు. మినీ బస్సులా కనిపించే ఈ డీఎంవీ 21 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం కలిగివుంది. రోడ్డుపై గంటకు 100కి.మీ వేగంతోనూ, పట్టాలపై గంటకు 60 కి.మీ వేగంతోనూ ప్రయాణించగలదు. ఇది డీజిల్‌ ఆధారిత వాహనం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement