Saturday, January 18, 2025

U-19 T20 WC | రేప‌టి నుండి మహిళల అండ‌ర్ 19 టీ20 ప్ర‌పంచ క‌ప్ !

మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025 కు రేపు తెర లేవ‌నుంది. జనవరి 18న ప్రారంభం కానున్న ఈ టోర్నీకి మలేషియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇదిలా ఉండగా, ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో సెమీఫైనల్‌ జనవరి 31న, ఫైనల్‌ ఫిబ్రవరి 2న జరుగుతాయి.

యంగ్ ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ప్రారంభ సీజన్ (2023), తర్వాతి సీజన్ (2024)లో గెలిచి టైటిల్ ను ముద్దాడిన యువభారత్… మరొసారి ప్రపంచ వేదికపై తమ ఆధిపత్యాన్ని చాటేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉండగా, 2025 మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు నికి ప్రసాద్ కెప్టెన్సీని నిర్వహిస్తుంది.

కాగా, నికి ప్రసాద్ నేతృత్వంలోని భారత జట్టు U-19 మహిళల ఆసియా కప్ 2024 ప్రారంభ ఎడిషన్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. డిసెంబర్ 22న జరిగిన ఫైనల్‌లో, బంగ్లాదేశ్‌ను 41 పరుగుల తేడాతో ఓడించి తొలి అండర్-19 మహిళల ఆసియా కప్‌ను గెలుచుకున్నారు.

- Advertisement -

రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో మ్యాచ్‌లు

ఈ టోర్నీలో పాల్గొనే 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. సూపర్ సిక్స్‌కు చేరుకున్న జట్లను రెండు గ్రూపులుగా విభజించి… ఒక్కో జట్టు రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇక్కడ రెండు గ్రూపుల్లోని పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. సెమీస్‌కు చేరుకున్న నాలుగు జట్లు సెమీ-ఫైనల్ 1, సెమీ-ఫైనల్ 2లో పోటీపడతాయి. ఇక్కడ విజేతలు ఫైనల్‌లో పోటీపడతారు.

భారత జట్టు..

నికి ప్రసాద్ (కెప్టెన్), సానికా చాల్కే (వైస్ కెప్టెన్), జి త్రిష, కమలిని జి (వికెట్ కీప‌ర్), భావికా అహిరే (వికెట్ కీప‌ర్), ఈశ్వరి అవసరే, మిథిలా వినోద్, జోషిత విజె, సోనమ్ యాదవ్, పరుణికా సిసోడియా, కేసరి దృతి, ఆయుషి శుక్లా, ఆనందిత కిషోర్, MD షబ్నం, వైష్ణవి. స్టాండ్‌బై ప్లేయర్‌లు: నంధన ఎస్, ఇరా జె, అనాది.

గ్రూప్ A: భారత్, మలేషియా, శ్రీలంక, వెస్టిండీస్;
గ్రూప్ B: ఇంగ్లాండ్, ఐర్లాండ్, పాకిస్థాన్, యునైటెడ్ స్టేట్స్;
గ్రూప్ సి: న్యూజిలాండ్, నైజీరియా, సమోవా, దక్షిణాఫ్రికా;
గ్రూప్ డి: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నేపాల్, స్కాట్లాండ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement