Saturday, November 23, 2024

Big Breaking | విమెన్స్‌ టీ20 వరల్డ్ కప్.. ఫైన‌ల్ పోరులో అద‌ర‌గొట్టిన ఆసీస్.. కస్​ సొంతం​

సౌతాఫ్రికాలో జరుగుతున్న విమెన్స్‌ టీ20 వరల్డ్ కప్ ఫైన‌ల్ లో కంగారూ జట్టు అదరగొట్టింది. సఫారీ జ‌ట్టుపై అల‌వోక‌గా గెలిచి వ‌ర‌ల్డ్ క‌ప్‌ని సొంతం చేసుకుంది. కాగా, ఆతిథ్య దక్షిణాఫ్రికా, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జ‌రిగింది. కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ గ్రౌండ్స్‌లో జ‌రిగిన‌ ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల న‌ష్టానికి ఆసిస్ మ‌హిళ జ‌ట్టు 156 పరుగులు చేసింది.

ఇక‌.. సఫారీ బౌలర్లు ఆసీస్ బ్యాటింగ్ లైనప్ ను సమర్థంగా కట్టడి చేశారు. భారీ స్కోరు సాధించకుండా నిలువరించారు. షబ్నిమ్ ఇస్మాయిల్ 2, మరిజానే కాప్ 2, ఎంలబా 1, క్లో ట్రయోన్ 1 వికెట్ తీశారు. ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్ బెత్ మూనీ అజేయంగా 74 పరుగులు చేసింది. ఆష్లే గార్డనర్ 29, వికెట్ కీపర్ అలిస్సా హీలీ 18 పరుగులు చేశారు. అయితే.. బ్యాటింగ్​లో పెద్దగా రాణించకున్నా బౌలింగ్​లో ఆసీస్​ మహిళా జట్టు అద్భుత ప్రతిభకనబరిచింది. దీంతో మరోసారి విమన్స్​ టీ20 వరల్డ్​ కప్​ని సొంతం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement