Wednesday, November 20, 2024

మార్చి 4 నుంచి మహిళల ప్రీమియర్‌ లీగ్‌.. హర్మన్‌ కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్‌ జట్టు నియామకం

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌ జట్టుకు హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ను కెప్టెన్‌గా నియమించింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ మార్చి 4 నుంచి ప్రారంభం కానుంది. ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023 ప్రారంభ ఎడిషన్‌లో, ముంబై ఇండియన్స్‌ తమ జట్టుకు హర్మన్‌ ప్రీత్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభం అయిన రోజు ముంబై ఇండియన్స్‌ జట్టు డివై పాటిల్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో గుజరాత్‌ జెయింట్స్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. పురుషుల ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆధారంగా మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభించారు. ప్రపంచ పవర్‌ హౌజ్‌గా ఎదగాలని భారత్‌ కోరుకుంటుంది. అరుణ్‌ ఢమాల్‌
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ ముంబైలో ప్రారంభం కానుంది.

- Advertisement -

దీని కోసం మహిళా క్రికెటర్లతో పాటూ బీసీసీఐ అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ అంటే భారత్‌తో సహా విదేశాల్లో వందలాది మహిళా క్రికెటర్ల భవితవ్యం మారనుందనే ప్రచారం ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన వేలంలో ఐదు ఫ్రాంచైజీలు మొత్తం రూ 4, 699.99 కోట్లకు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత జరిగిన ఆటగాళ్ల వేలంలో భారత్‌ ఓపెనర్‌ స్మతి మందాన అత్యధిక ధరకు వెళ్లింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగులూరు ఆమెకు రూ 3. 40 కోట్లు వెచ్చించింది. క్రికెట్‌లో ప్రపంచ పవర్‌ హౌజ్‌గా ఎదగాలని భారత్‌ కోరుకుంటుందని ఐపీఎల్‌ చైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement