Monday, November 11, 2024

ఉమెన్స్‌ లీగ్‌కు 409 మంది ప్లేయర్లు, 163 మంది విదేశీ క్రికెటర్లు.. ఈ నెల 13న వేలం ప్రక్రియ

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో పాల్గొటున్న క్రికెటర్ల తుది జాబితాను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. 409 పేర్లను వెల్లడించింది. భారతీయ క్రికెటర్లు 246 మంది, విదేశీ క్రికెటర్లు 163 మంది ఉన్నారు. ఫిబ్రవరి 13న వేలం జరగనుంది. వీళ్లలో భారతీయ క్రికెటర్లు 246 మంది, విదేశీ క్రికెటర్లు 163 మంది ఉన్నారు. జాతీయ జట్టుకు ఆడిన వాళ్లు 202 మంది, అరం గ్రేటం చేయనివాళ్లు 199 మంది, సంయుక్తదేశాలకు చెందిన 8 మంది ఈ వేలానికి ఎంపికయ్యారు. ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2: 30 గంటలకు వేలం జరగనున్నది. మొత్తం 90 స్లాట్స్‌ను విదేశీ క్రికెటర్లకు కేటాయించారు. బీసీసీఐ మొదటి సారిగా నిర్వహిస్తున్న టోర్నీ కావడంతో 1, 525 మంది ప్లేయర్లు వేలంలో పేర్లు నమోదు చేసుకున్నారు. చివరకు 409 మంది షార్ట్‌ లిస్ట్‌ అయ్యారు.

వేలంలో పాల్గొంటున్న వాళ్లలో 24 మంది రూ 50 లక్షల కనీస ధరకు ఎంపికయ్యారు. 30 మంది ప్లేయర్స్‌ రూ 40 లక్షల బేస్‌ ప్రైజ్‌కు పేర్లు రిజిస్ట్‌ర్‌ చేసుకున్నారు. రూ 50 లక్షల జాబితాలో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, స్మృతి మందాన , దీప్తి శర్మ వంటి భారత క్రికెటర్లు ఉన్నారు. 13 మంది విదేశీ క్రికెటర్లు కూడా రూ 50 లక్షలకు తమ పేరు రిజిస్టర్‌ చేసుకున్నారు. వాళ్లు ఎవరంటే ఎల్లిసే పెర్రీ(ఆస్ట్రేలియా), సోఫీ ఎక్లెస్టోన్‌( ఇంగ్లండ్‌, సోఫీ డెవినె (న్యూజిలాండ్‌), డియాండ్ర డొటిన్‌ (వెస్టిండీస్‌). వచ్చే నెల 4 నుంచి క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ముంబై వేదికగా మార్చి 4న మొదలు కానుంది. ఈ టోర్నీలో మొత్తం ఐదు ఫ్రాంచైజీలు పాల్గొంటున్నాయి. ఈ జట్లు 22 మ్యాచ్‌లు ఆడతాయి. మార్చి 22న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement