Wednesday, November 27, 2024

ఇక మహిళల ఐపీఎల్‌..

ముంబై : పురుషుల ఐపీఎల్‌ మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఐపీఎల్‌ను నిర్వహించడానికి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నది. టీ20 ప్రపంచ కప్‌ టోర్నమెంట్‌ ముగిసిన తరువాత ఈ దిశగా తక్షణ చర్యలు ఆరంభిస్తుందని సమాచారం. వచ్చే ఏడాది పురుషుల ఐపీఎల్‌తో పాటు మహిళల ఐపీఎల్‌ టోర్నీ కూడా నిర్వహించేలా భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటుందని అంటున్నారు.

మహిళల ఐపీఎల్‌ టోర్నీకి ఏ స్థాయిలో అభిమానుల నుంచి ఆదరణ లభిస్తుందో వేచి చూడాలి. మహిళల ఐపీఎల్‌లోనూ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఉవ్విళ్లూరుతున్నది. ఈ విషయాన్ని ఆ జట్టు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ జేక్‌ లుష్‌ మెక్రమ్‌ ప్రకటించాడు. మహిళా ఐపీఎల్‌ ఫ్రాంచైజీని కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు. వెలుగులోకి రాని ఎంతో మంది మహిళా క్రికెటర్లకు ఈ ఐపీఎల్‌ ఎంతో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. పురుషులతో పాటు మహిళలు కూడా ఐపీఎల్‌లో రాణించాల్సిన అవసరం ఉందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement