అక్టోబర్ 23 నుంచి నవంబర్ 1 వరకు జరగనున్న ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఎఎఫ్‌సి) మహిళల ఒలింపిక్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ రౌండ్ 2 చివరి డ్రా కోసం భారత మహిళల జట్టు ఇరాన్, ఉత్తర కొరియాతో కలిసి గ్రూప్-4లో చోటు దక్కించుకుంది. గురువారం (రేపు) మలేషియాలోని కౌలాలంపూర్ ఎఎఫ్‌సి హౌస్‌లో నిర్వహించబడే డ్రాలో మొత్తం 12 జట్లు మూడు గ్రూపులుగా విభజింపబడ్డాయి. రౌండ్ 1 క్వాలిఫైయింగ్ నుంచి ఏడు గ్రూప్ విజేతలు, రౌండ్ 2లో ఆటోమేటిక్ బైస్ పొందిన ఐదు హైసీడ్ జట్లు డ్రాకు సిద్ధమయ్యాయి. పాట్:1లో ఆస్ట్రేలియా, జపాన్,చైనా ఉండగా, పాట్:2లో కొరియా రిపబ్లిక్, చైనీస్ తైపీ, వియత్నాం ఉన్నాయి. అలాగే పాట్:3లో థాయ్, ఫిలిప్పీన్స్, ఉజ్బెకిస్తాన్ జట్లుండగా, పాట్:4లో ఇండియా, ఇరాన్, డీపీఆర్ కొరియా ఉన్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement