Wednesday, December 18, 2024

Sandhya Theater Stampede | చిన్నారి తేజ ఆరోగ్యంపై మహిళా కమిషన్‌ ఆరా !

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా… ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘ‌ట‌న సంచలంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో రేవతి అనే మహిళ మృతి చెందగా… ఆమె కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితికి వెళ్లాడు.

కాగా, శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ఆసుపత్రికి వెళ్లి బాలుడ్ని పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

అంత‌క‌ముందు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆ బాలుడిని పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాలుడికి అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement