క్రికెట్‌లో మహిళా భాగస్వామ్యం పెంచే దిశగా బీసీసీఐ మరో ముందడుగు వేయనుంది. దేశ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా పురుషుల క్రికెట్‌లో మహిళా అంపైర్లు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. త్వరలో ప్రారంభం కాబోయే రంజీట్రోఫీ -2022 నుంచి ఈ ప్లాన్‌ను అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి బోర్డు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
త్వరలో ప్రారంభం కాబోయే రంజీ సీజన్‌నుంచి మ్యాచ్‌లకు ఉమెన్ అంపైర్లు కూడా అంపైరింగ్ చేయబోతున్నారు. ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో కూడా మహిళా అంపైర్లను (భారత్ ఆడే మ్యాచ్‌లకు చూడొచ్చు) అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇటీవలె మహిళా క్రికెటర్ల వేతనాలను పురుషులతో సమానంగా పెంచుతూ బీసీసీఐ తాజాగా మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మహిళా అంపైర్లుగా వృందారతి, జనని నారాయణ్, వేణుగోపాలన్‌లు ప్రస్తుతం భారత మహిళా జట్టు ఆడే మ్యాచ్‌లకు పని చేస్తున్నారు. ఈ ముగ్గురే ఇప్పుడు ఉమెన్ అంపైర్లుగా రంజీలలో కనిపించనున్నట్లు సమాచారం. ముంబయికి చెందిన వృందారతి.. స్కోరర్‌గా పని చేసే వారు.
కానీ న్యూజిలాండ్‌కు చెందిన అంపైర్ కాతీ క్రాస్ స్పూర్తితో ఆమె అంపైర్‌గా రాణిస్తున్నారు. తమిళనాడుకు చెందిన జనని నారాయణ్ చెన్నయ్‌లో సాప్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలి అంపైర్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన అంపైర్ల ఇంటర్వ్యూలో నెగ్గిన ఆమె తర్వాత బీసీసీఐ నిర్వహించే మ్యాచ్ లకు కూడా అంపైరింగ్ చేస్తున్నారు. ఇక గాయత్రీ వేణుగోపాలన్ కూడా మొదట్లో క్రికెట్ గురించి పెద్దగా అవగాహన లేకపోయినా తర్వాత ఆట మీద ఆసక్తితో అంపైరింగ్‌లోకి వచ్చారు.
బోర్డు పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా సీనియర్ మహిళా జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న రమేష్ పవార్‌ను జాతీయ క్రికెట్ అకాడమీ(ఎస్‌సీఏ)కు బదిలీ చేసింది బీసీసీఐ. అకాడమీలో పురుషుల జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. కాగా ఇది వరకు ఇండియా ఏ, ఇండియా అండర్ 19 జట్లకు పని చేసిన టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ హృషికేష్ కని త్కర్‌ను సీనియర్ మహిళా జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది.