Friday, November 22, 2024

రణరంగంలో మహిళా సైనికులు.. సైనికులకు ధైర్యాన్నిస్తున్న కాటెరీనా

రష్యాకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌ మహిళలు పాల్గొన్నారు. సైనికులకు ధైర్యాన్నిస్తూ మానసికంగా బలోపేతులను చేయడం, యుద్ధ ట్యాంకులను నడిపిస్తూ ఫ్రంట్‌ లైన్‌లో వుండి దూసుకుపోతున్నారు. ఉక్రెయి న్‌ సైన్యానికి చెందిన కాటెరీనా, కరీనా అనే ఇద్దరు మహిళా సైనికులు యుద్ధరంగంలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నా రు. వారిద్దరూ యుద్ధరంగంలో తమ అనుభవాలు, తమ జీవితాల గురించి తెలిపిన సమాచారం ఇది. ఫ్రంట్‌లైన్‌కు వెళ్లే ముందు కాటెరీనా ఎప్పుడూ సహచరులతో కలిసి ఫొటోలు కూడా తీసుకోదు. శత్రువులకు ఎదురుగా వెళుతున్నట్లు కరీనా తన తల్లికి చెప్పదు. ఇంట్లో ధైర్యాన్ని పెంపొందించడానికి అయానా సోషల్‌ మీడియాను ఉపయోగిస్తుంది.

తూర్పు ఉక్రెయిన్‌లో మరొక రోజు యుద్ధంలో పాల్గొనడానికి ముందు ఒక గ్రామంలో తమ యూనిట్‌తో కలిసి విశ్రాంతి తీసుకుంటు న్నారు. సెంట్రల్‌ ఉక్రెయిన్‌లోని విన్నిట్సియాకు చెందిన కాటె రినా నోవాకివ్స్కా, (29), తూర్పు ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక ప్రాంతమైన డాన్‌బాస్‌లోని ఒక యూనిట్‌కు డిప్యూటీ కమాం డర్‌గా ఉన్నారు. ఈ ప్రాంతంలో పోరాటం ఉధృతంగా ఉం టుంది. యుద్ధం ప్రారంభమైనప్పుడు కాటెరినా ఆర్మీ అకాడ మీ నుండి పట్టభద్రురాలైంది. యుద్ధరంగంలో ఆమె పాత్ర దళాలకు నైతిక, మానసిక మద్దతును అందించడం. సైనికుల లో అత్యంత ధైర్యాన్ని, ఉక్రెయిన్‌ లక్ష్యం, న్యాయం గురించి చెప్పిన తర్వాత ఆమె దేశ భవిష్యత్‌ గురించి కూడా సైనిక దళాల కు వివరిస్తుంది. ‘దళాలకు అత్యంత కష్టమైన విషయం తోటి సహచరులను కోల్పోవడం” అని ఆమె చెప్పింది.

సైనికులు తమ కుటుంబసభ్యులకు చెప్పలేని విషయాలు చాలా ఉన్నా యి. అవన్నీ నాతో చెబుతారు. కాటెరినా ముక్కుపై చిన్న మచ్చ ఉంది. మార్చిలో పేలుడుకు గుర్తుగా మచ్చ మిగిలింది. ఉక్రె యిన్‌ తూర్పు ముందు భాగంలో ప్రతిరోజు డజన్ల కొద్దీ సైనికు లు చంపబడుతున్నారు. ఇక్కడ రష్యా దళాలు మే జూన్లలో పెద్ద పురోగతిని సాధించాయి. దాదాపు మొత్తం లుగాన్స్క్‌ ప్రాంతాన్ని ఆక్రమించాయి. అప్పటినుండి ముందు వరుస కొద్దిగా కదిలింది. కానీ రెండువైపుల మధ్య క్రూరమైన ఫిరంగి యుద్ధాలు జరుగుతున్నాయి. రెండేళ్ల ఒప్పందంపై 2020లో సైన్యంలోకి వచ్చిన తాజిక్‌ మూలానికి చెందిన మాజీ టెక్స్‌టైల్‌ కార్మికురాలు కరీనా. తన సాయుధ వాహనాన్ని ముందు వరుస నుండి నడుపుతోంది.

”మేము పొజిషన్‌లో ఉన్నప్పు డు తోటి సైనికుల గురించి ఆలోచించడం చాలా కష్టం. ఎవరూ చనిపోకూడదు, గాయపడకూడదని మీకు మీరే దాడి చేయ కూడదని ఆశిస్తున్నాను అని మెకానిక్‌ కూడా అయిన ఆమె చెప్పింది. ఆమె భర్త ఇంట్లో ఆమె కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. కరీనా తన తల్లికి ఫోన్‌ చేసినప్పుడు ”నేను లైన్‌ జీరోలో ఉన్నాన”ని నేను ఆమెకు చెప్పను. కరీనాకు భ్రమలు లేవు. యుద్ధం త్వరలో ముగుస్తుందని ఆమె అనుకోదు. ఉక్రె యిన్‌లో రష్యన్లు ఇప్పటికే చాలా భూభాగాలను స్వాధీనం చేసు కున్నారని ఆమె చెప్పింది. ఏం జరిగినా గెలుస్తాం. విజయం తప్ప మరో మార్గంలేదని ఆమె అన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement