Monday, November 25, 2024

మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణించాలి : మంత్రి స‌త్యావతి రాథోడ్‌

హన్మకొండ : మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణించాల‌ని.. ఆ దిశ‌గా ఇప్ప‌టి నుంచే అడుగులు వేయాల‌ని మంత్రి స‌త్యావతి రాథోడ్ అన్నారు. వడ్డెపల్లి పింగళి మహిళా డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఇంటర్ డిసిప్లినరీ నేషనల్ కాన్ఫరెన్స్ ముగింపు కార్యక్రమంలో మంత్రి సత్యావతి రాథోడ్, ప్రభుత్వ ఛీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, కూడా చైర్మన్ సుందర్ రాజ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి సత్యావతి రాథోడ్ మాట్లాడుతూ.. మహిళలు సమాజంలో గౌరవంగా జీవించేలా తీర్చి దిద్దుతున్న కళాశాల అధ్యాపక, ప్రిన్సిపాల్ కి అభినందనలు తెలిపారు. పింగిలి కళాశాలకు చరిత్రాత్మక గుర్తింపు ఉంద‌ని, మహిళలు విధానపరమైన నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగార‌న్నారు. తెలంగాణలో తొలి మహిళా మంత్రి అయ్యనంటే అది కేసీఆర్ చలవేన‌ని, నాది 30ఏండ్ల రాజకీయ ప్రస్థానం అని గుర్తు చేశారు. దేశానికి ప్రధాని అయిన ఇందిరా గాంధీయే మహిళలకు ఆదర్శం అన్నారు. కేంద్ర ప్రభుత్వం చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్ అమలు చేయాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement