సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఓ మహిళ వినూత్నంగా నిరసన తెలిపింది. తాళి బొట్టును తహసీల్దార్ కార్యాలయ గేటుకు కట్టి.. తన సమస్యను పరిష్కరించాలని అక్కడే బైఠాయించింది. వివరాల్లోకి వెళ్తే.. రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన పొలాస రాజేశం మంగకు చెందిన సర్వే నెంబర్ 130/14లో గల 2 ఎకరాల భూమిని తన భర్త రాజేశం మూడేళ్ల క్రితం చనిపోగానే వేరే వాళ్ళకి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పట్టా చేశారని, భూమి తనకు పట్టా చేయాలని మూడేళ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మహిళ వాపోయింది. తన భర్త ఎలాగో లేడని, తన తాళిబొట్టు తీసి ఆఫీస్ గేటుకు వేలాడదీసి ఈ తాళిబొట్టును లంచంగా తీసుకొని తన భూమి తనకు పట్టా చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది. బాధిత మహిళ ఉద్యోగ రీత్యా మెటపల్లిలో పని చేసుకుంటూ ఉండగా తన భూమిని వేరే వాళ్ల పేరుపై రిజిస్టర్ చేసి పట్టా జారీ చేశారని ఆమె ఆరోపిస్తోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతోంది. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని ఆమె వేడుకుంటోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement