అమరావతి, ఆంధ్రప్రభ: మత్తు మాఫియాలో మహిళలు స్మగ్లర్లుగా వ్యవహరించడం ఇప్పుడు రాష్ట్రంలో ఆసక్తి రేపుతోంది. డ్రగ్స్, మాదక ద్రవ్యాల రవాణా, వినియోగం మాట అలా ఉంచితే.. రాష్ట్రానికి ఎన్నో సంవత్సరాలుగా వదలని మత్తు గంజాయి. గంజాయి నియంత్రణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఆమాఫియా మాత్రం వేళ్ళూనుకుంటూ నలుదిశలా విస్తరించుకుంటూ పోతోంది. గంజాయి వ్యాపారంలో రూపాయికి వంద రూపాయలు సంపాదించడం అలవాటు పడిన చాలా మంది మాఫియాగా మారి ఏజెన్సీ ప్రాంతంలో దీని సాగును గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో విరివిగా పండించే గంజాయిని దిగుమతి చేసుకుని టన్నుల కొద్ది పొరుగు రాష్ట్రాలకు రావాణా చేసే వ్యవస్ధ వెనుక పెద్ద మాఫి యానే ఉందనేది జగమెరిగిన సత్యం.
అయితే ఈ మత్తు మాపియాలో మహిళలను స్మగ్లర్లుగా మార్చి పావులుగా విని యోగించుకోవడం మరింత ఆందోళన కలిగిస్తున్న విషయం. రాష్ట్రంలోని ఏజెన్సీలో పండే గంజాయి అనేక మార్గాల్లో విజయవాడ మీదుగా తెలంగాణా, కర్నాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, ముంబయి, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బంగ్లాదేశ్ తదితర రాష్ట్రాలకు రవాణా అవుతోంది. అనేక సందర్భాల్లో పోలీసులుకేజీల కొద్దీ గంజాయిని స్వాధీనం చేసుకున్న సందర్భాల్లో సరుకు ఎక్కడికి వెళ్తోందని ఆరా తీస్తే వెలుగు చూస్తున్న విషయాలు కొత్తేమీ కాదు. ఇటీవల కాలంలో అయితే గంజాయి రవాణా విషయంలో స్మగ్లర్లు అనేక మెళకువలు ప్రదర్శిస్తున్నారు. సినిమాల ప్రభావం, నైపుణ్యంతో పాలు, పండ్లు, ఇతర సామాగ్రి మాటున టన్నుల టన్నులుు, కేజీల కేజీలు గంజాయి చేరవేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పట్టుబడినప్పుడు పోలీసులే నివ్వెరపోతు న్నారు. అయితే మరో అడుగు ముందుకేసిన మాఫియా ఈ చీకటి వ్యాపారానికి మహిళలను ఎంచుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది వలస పేదలు, రోజువారీ కూలీలు కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
పేదరికం.. వారి అవసరాలే ఆసరాగా..
ఈ వ్యాపారంలో చిక్కుకుంటున్న మహిళలు పేద, మద్య తరగతికి చెందిన వారే. వారి అవసరాన్ని ఆసరా చేసుకుని మాఫియా వీరిద్వారా గంజా యి రవాణా చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే రోజు కూలికి, వలస పనులకు వెళ్ళినా రాని డబ్బుకు రెట్టింపు గిట్టుబా టు కావడంతో మహిళలు కూడా ఆసక్తిగా ఈ చీకటి వ్యాపారంలో రాణిం చేందుకే మొగ్గు చూపుతు న్నారు. పైగా మాఫియాకు మహిళా స్మగ్లర్లకు మధ్య వీరిపై అజమాయషీ చేసేందుకు ఓ మహిళా సూపర్ వైజర్లు కూడా ఉండటం గమనార్హం. కూలి చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే మహిళల పేదరికమే గంజాయి మాఫియాకు వరంగా మారుతోంది. తెలంగాణా, మహా రాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన గం జాయి మాఫి యా సరుకు సరఫరాలో మహిళలు, యువతులను పావులుగా వాడుతు న్నారు. వీరిని గ్రూపులుగా తయారు చేసి ఒక్కో గ్రూపులో నలుగురైదుగురిని ఏర్పాటు చేసి కార్లలో, ప్రత్యేక వాహనాల్లో రాష్ట్రంలోని ఏజెనీ ్స ప్రాంతాలకు తీసుకువస్తున్నారు. ఇక్కడి మాఫియా ఏజెంట్లకు అప్పగించగా.. సేకరించిన గంజాయిని వివిధ పద్ధతుల్లో వీరి ద్వారా రైలు, రోడ్డు మార్గాల్లో అనుకున్న చోటుకి సరఫరా చేయిస్తున్నారు. ఒక వేళ మార్గంలో తనిఖీలు ఉంటే సదరు మహి ళలు సరుకుగా దూ రంగా జరు గుతా రు.లేదంటే పోలీ సులకు దొరక కుండా జాగ్రత్త పడతారు. అయితే ఈ వ్యవ హారంలో మహి ళలు కావడంతో తనిఖీల్లో కూడా పోలీసుల దృష్టి అంతగా వీరిపై ఉండకపోవడం కలిసివచ్చే అంశం. ఇలా లక్ష్యానికి సరుకు చేరాక ఒకొక్కరికి వేలల్లో ముట్టచెబుతారు.
అజమాయషీ చేసేవారూ మహిళలే..
గంజాయి మాఫియాకు చిక్కి పావులుగా మారి స్మగ్లర్లుగా పిలువబడుతున్న నిరుపేద మహిళలపై ఈ వ్యాపా రంలో అజమాయషీ చేసేవారు కూడా మహిళలే కావడం గమనార్హం. అయితే వీరు మాత్రం పక్కాగా గంజాయి వ్యాపా రంలో అడుగుపెట్టి, వాటాదారులుగా చెలామణి అవుతు న్నవారేనని పోలీసులు చెబుతున్నారు. కొంతమంది మహిళా లీడర్లు పైకి వ్యాపార వేత్తలుగా చెలామణి అవుతూ, మరోవై పు వెనుక రాజకీయ అండదం డలు పెంచుకుంటూ, కొందరు కొన్ని రాజకీయ పార్టీల్లో చెలామణి అవుతూ మరోవైపు చీకటి కోణంలో గంజాయి వ్యాపారంలో డబ్బు సంపాదనకు అల వాటుపడిన వారేనని అంటున్నారు. ఈక్రమంలోనే ఇటీవల పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన టీడీపీ మహిళా నేత మానుకొండ జాహ ్నవిని గతనెల 15న తెలంగాణా పోలీసులు అరెస్టు చేసిన విషయం ప్రస్తావిస్తున్నారు. గంజాయి రవాణా కేసులో ఈమెతో కలిపి మొత్తం నలుగురు నిం దితులుగా ఉన్నారు. ఈ తరహా మహి ళలు ఈ వ్యాపారంలో చలా మణి అవుతుం డగా గం జాయి స్మగ్లర్లు, మా ఫియా మహిళలను పావులుగా చేసుకుని చీకటి సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. ఇటీవల ధాయ్‌లాండ్ దేశం గంజాయి సాగుకు చట్టబద్దత కల్పించిన నేపధ్యంలో ఇక్కడ మాపియా గంజాయి ఎగుమతులపై పెద్ద ఎత్తున దృష్టి సారించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పోలీసులకున్న సమాచారం.
ఎస్కార్ట్ విధులకూ మహిళలే..
గంజాయి రవాణాలో కీలక పాత్ర ఎ స్కార్ ్టలదే. ఒక ప్రాంత నుంచి చేరాల్సిన చోటు వాహనంలో సరుకు వెళ్తున్నప్పుడు ఆ వాహనాన్ని కొంత దూరంలో మరో వాహనం లేదా మోటారు సైకిల్ అనుసరిస్తూ ఉంటుంది. సరుకు వాహనం ప్రమాదానికి గురైనా.. దారి మళ్ళినా లేదా పోలీసులకు దొరికిపోయినా.. ఈ ఎస్కార్ట్ వాహనంలో ఉండేవారు వెంటనే మాఫియాకు సమాచారం అందించి అప్రమత్తం చేస్తుంది. అదేవిధంగా ఈ ఎస్కార్ట్ వాహనం సరుకు వాహనానికి ముందుగా వెళ్తూ మార్గంలో తనిఖీలు, చెక్‌పోస్టుల వద్ద పరిస్ధితులను ముందుగానే గుర్తించి సరుకు వాహన డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంటుంది. అనేక సందర్భాల్లో ఎస్కార్ట్ వాహనాలకు ప్రమాదాలకు గురై అందులోని వ్యక్తులు మృత్యువాత పడిన సందర్భాలు లేకపోలేదు. ఇంతటి కీలకమైన ఎస్కార్ట్ విధులకు గంజాయి మాఫియా ఈ మహిళలను వినియోగించుకుంటోంది. ఇలా పని చేసిన వారికి ఒక్కొక్కరికి 20వేల నుంచి గిట్టుబాటు అవుతోంది. నెలంతా కష్టపడినా రాని సొమ్ము రెండు, మూడురోజులు డ్యూటీ చేస్తే చాలని స్మగ్లర్లు ఆశ చూపుతారని అందుకే పేదలైన మహిళలు ఎక్కువగా ఇటు వైపు మొగ్గు చూపుతున్నారంటూ ఓ పోలీసు అధికారి అన్నారు. ఇటీవల ఏజెన్సీ నుంచి సరఫరా అవుతున్న సరుకును పెద్ద ఎత్తున తెలంగాణా పోలీసులు పట్టుకున్నారు. అయితే దొరికివారంతా మహిళలే కావడం గమనార్హం. పైగా పట్టుబడిన వారెవ్వరూ ఈ గంజాయి వ్యాపారంలో గతంలో ఎన్నడూ ఎలాంటి కేసులు లేని వారేనని పోలీసులు చెబుతున్నారు.