Sunday, November 24, 2024

మ‌ద్యం మ‌త్తులో యువ‌తి హంగామా- పోలీసు కాల‌ర్ ప‌ట్టుకుని బెదిరింపులు

ఫుల్ గా తాగిన ఓ యువ‌తి కారుని డ్రైవ్ చేసుకుంటూ రోడ్డుపైకి వ‌చ్చింది.మ‌ద్యం మ‌త్తులో రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసింది. తాగిన మైకంలో అందరినీ తిడుతూ నానా హంగామా చేసింది. అదే సమయంలో అటుగా వెళుతున్న పోలీసులు ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసుల రాకతో ఆవేశంతో ఊగిపోయింది సదరు యువతి. తాగిన మత్తులో ఏం చేస్తుందో కూడా తెలియకుండా ప్రవర్తించింది. విధుల్లో ఉన్న పోలీసులు పట్ల నడిరోడ్డుపై దురుసుగా ప్రవర్తించింది. ఆయన కాలర్ పట్టుకుని బెదిరిస్తూ వాగ్వివాదానికి దిగింది. పోలీసు అధికారి జుట్టుపట్టుకుని ప్రయత్నించింది. అంతటితో ఆగకుండా చివరిలో పోలీస్ ధరించిన మాస్క్ ని లాక్కుని కింద పడేసింది.ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది.

ఇంత జరుగుతున్నా ఆ పోలీస్ అధికారి ఆమెను ఏమీ అనలేదు. మహిళ కావడంతో అతను సైలెంట్ గా ఉన్నాడు. యువతి మీద మీదకు వస్తుంటే ఆమెను దూరంగా జరిపాడు. యువతి ప్రవర్తిస్తున్న తీరును కొంతమంది తమ ఫోన్ లో రికార్డు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ జర్నలిస్టు తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యువతి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయి కావడంతో ఆ పోలీస్ అధికారి నిస్సహాయంగా ఉండిపోయారని లేకుంటే మరోలా ఉండేది అని కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement