Tuesday, November 26, 2024

వింత జబ్బు కారణంగా 40 ఏళ్లుగా నిద్రపోని మహిళ

మనిషి జీవితంలో నిద్ర అనేది చాలా ముఖ్యమైన అంశం. కంటినిండా నిద్ర ఉంటేనే ఉదయాన్నే లేచి ప్రశాంతంగా పని చేసుకోవచ్చు. ఒకరోజు లేదా రెండు రోజులు ఆరోగ్యకరమైన నిద్ర లేకపోతే అనారోగ్యం పాలు కావడం ఖాయం. అయితే మహిళా ఏకంగా 40 ఏళ్ల నుంచి అసలు నిద్ర పోవటం లేదట. ఎంత ప్రయత్నించినా ఆమె అసలు నిద్ర పట్టడం లేదట. ఇలాంటి వింత వ్యాధి చైనాలో వెలుగులోకి వచ్చింది… చైనాకు చెందిన జ్యానింగ్ అనే మహిళ వయస్సు 45 సంవత్సరాలు. ఈమె గత 40 ఏళ్ల నుంచి నిద్రలేమి సమస్యతో బాధపడుతోంది. ఈ వింత జబ్బు కారణంగా ఆమె ఒక్క సెకను కూడా నిద్రపోలేదట. చిన్నప్పుడు తప్ప గత నలభై సంవత్సరాల నుంచి ఏనాడూ ఆ మహిళ నిద్ర పోలేదట.

ఆమెకు వివాహం జరిగి దాదాపు 25 సంవత్సరాలు పూర్తయింది. వివాహమైనప్పటికీ ఆమె నిద్రపోకుండా ఉంటుంది. ఈ విషయంలో ఆమె భర్త.. ఎంతో మంది వైద్యులను మరియు ఆసుపత్రులు తిరిగినా ప్రయోజనం జరగలేదు. ఈ వింత వ్యాధి ఎవరికి చూపించినా తనకు అర్థం కావడం లేదని వైద్యులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఆమె భర్త కూడా ఏమీ చేయలేక ఉండిపోతున్నాడు. ఇక ఇలాంటి వ్యాధి తానెప్పుడూ చూడలేదని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement