ఛత్తీస్‌గఢ్ సూరజ్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. శ్రావణమాసంలో తన భర్త చికెన్ తిన్నాడని ఓ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. రౌదా గ్రామానికి చెందిన రామ్ జనమ్ సింహ్ ఆగస్టు 22న రక్షాబంధన్ సందర్భంగా తన బంధువులతో కలిసి చికెన్ తిన్నాడు. అయితే శ్రావణ మాసంలో చాలామంది మాంసం తినడం ఆపేస్తారు. కానీ, రామ్ జనమ్ చికెన్ తినడం చూసి తన భార్య తట్టుకోలేకపోయింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె.. వెంటనే ఇంట్లో ఉన్న కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది.
ఈ పరిణామాన్ని ఊహించని రామ్ జనమ్ సింహ్.. తన భార్యను రక్షించుకునే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే తన భార్య శరీరం చాలా మేరకు కాలిపోయింది. వెంటనే అతడిని కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. అంబికాపూర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. మంటలను ఆర్పే క్రమంలో తన ఎడమ చేయికి కూడా నిప్పంటుకుందని భర్త రామ్ జనమ్ సింహ్ తెలిపాడు.
ఈ వార్త కూడా చదవండి: సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తున్నాడా? ఇందులో నిజమెంత?