Tuesday, November 26, 2024

మహిళపై బ్లేడుతో దాడి, 118 కుట్లు.. బాధితురాలిని పరామర్శించిన సీఎం చౌహాన్‌

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్తతో కలిసి కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్తూ మార్గమధ్యలో వాటర్‌ బాటిల్‌ కొనేందుకు ఓ దుకాణం వద్దకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడే గుమిగూడి ఉన్న కొందరు యువకులు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు. కామెంట్స్‌ చేస్తూ హేళన చేశారు. దీంతో ఆమె ఎదిరించి, ఆకతాయిలపై దాడి చేసింది. చెప్పుతో కొట్టింది. పరిసర వాసులంతా గుమిగూడి ఆకతాయిలను చెదరగొట్టారు. పరిస్థితి అంతా సద్దుమణిగింది. ఆమె కూడా భర్తతో కలిసి మార్కెట్‌కు వెళ్లింది. ఆ యువకులు మళ్లి వెనక్కి వచ్చి వెనక నుంచి ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. బ్లేడుతో ముఖంపై దాడి చేశారు.

అటు నుంచి దుండగులు పారిపోయారు. స్థానికుల సహాయంతో భర్త ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బాధితురాలిన పరిశీలించి, 118 కుట్టు వేశారు. మందులు రాసిచ్చి, డిశ్చార్జ్‌ చేశారు. సోషల్‌ మీడియాలో ఈ ఘటన హల్‌చల్‌ చేసింది. రాజకీయ దుమారం చెలరేగింది. విషయం తెలుసుకున్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేరుగా ఆమె ఇంటికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. బాధితులకు అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement