పంజాబ్లో మళ్లీ పాగా వేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా కొన్ని రోజుల నుంచి పంజాబ్ నాయకులతో వరు భేటీలు నిర్వహిస్తోంది. పార్టీలో చీలికలు, వ్యతిరేకత లాంటి సవాళ్లను అధిగమించేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నది. 2022 పంజాబ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించుకుండానే.. కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగాలని నిర్ణయించింది. గత ఎన్నికల్లో కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకతంలో పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుతాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు పెను సవాల్‌గా మారనున్నాయి.
కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ, బీజేపీ పొత్తు, పంజాబ్ కాంగ్రెస్‌లో చీలిక లాంటి నివేదికలతో కాంగ్రెస్ పార్టీకి ఇది అంత తేలికైన ఎన్నిక కాదంటూ రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. పంజాబ్‌లో.. 117 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మందికి టికెట్ ఇవ్వకూడదన్న (ఒకే కుటుంబం-ఒకే టికెట్) విధానాన్ని కాంగ్రెస్ తెరపైకి తీసుకొచ్చినట్టు సమాచారం. కమిటీ మొత్తం 117 అసెంబ్లి స్థానాలపై చర్చించింది. ఒక కుటుంబానికి ఒకటి కంటే ఎక్కువ టికెట్లు ఇవ్వకూడదని పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు పంజాబ్ వ్యవహారాల ఇన్‌చార్జి కార్యదర్శి హరీష్ చౌదరీ కూడా కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు.