Sunday, November 24, 2024

Delhi | సుప్రీంకోర్టులో R5 జోన్ పిటిషన్ ఉపసంహరణ..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆర్ 5 జోన్ వ్యవహారంలో దాఖలు చేసిన పిటిషన్‌ను అమరావతి రైతులు ఉపసంహరించుకున్నారు. ఈనెల 19న హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో వారు పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఆర్‌ 5 జోన్‌ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే విషయంపై హైకోర్టు డివిజన్ 19న విచారణ జరపనుంది. అమరావతి రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై స్థానిక రైతులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసే సమయానికి హైకోర్టు ఉత్తర్వులు విడుదల కాలేదని, ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయని జస్టిస్‌ కెఎం జోసెఫ్‌, జస్టిస్‌ బివి నాగరత్న ధర్మాసనం దృష్టికి రైతుల తరపు సీనియర్‌ న్యాయవాది శ్యాందివాన్‌ తీసుకొచ్చారు. శ్యాందివాన్‌ వాదనతో ఏకీభవించి పిటిషన్‌ వెనక్కి తీసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. రాష్ట్ర హైకోర్టు తీర్పు తరువాత మళ్లీ సుప్రీంకోర్టుకు వచ్చేందుకు ధర్మాసనం అంగీకరించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement